వృద్ధులు, వితంతువులకు వస్త్రాలు మరియు గృహోపకరణాల పంపిణీ కొండపి మండలం, ప్రకాశం జిల్లా | 15 ఆగస్టు 2026 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సుధా ఫౌండేషన్ – సుధా ఓల్డ్ ఏజ్ హోమ్, పెట్లూరు ఆధ్వర్యంలో వృద్ధులు మరియు వితంతువులకు వస్త్రాలు, గృహోపకరణాలు పంపిణీ చేసే సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులు, వితంతువులకు అవసరమైన దుస్తులు మరియు గృహోపయోగ వస్తువులను అందజేశారు. సమాజంలో ఆపన్నులకు అండగా నిలవడం, అవసరమైన వారికి సహాయం చేయడం తమ బాధ్యతగా భావిస్తూ సుధా ఫౌండేషన్ ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కొండపి సీఐ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు వస్తువులు అందజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అభినందించారు. కార్యక్రమంలో సుధా ఫౌండేషన్ అధ్యక్షులు కె. సుధాకర్ గారు, సుధా ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రేమరాజు గారు, కొమ్ము బాబురావు గారు,నెహెమ్యా, ఫౌండేషన్ సభ్యులు మరియు ఇతర సేవాభిమానులు పాల్గొన్నారు. వృద్ధుల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడం, అవసరమైన వారికి త...
Founder : KOMMU SUDHAKAR #SUDHA FOUNDATION mission is supporting at-risk women & children to obtain the much needed resources to realize their dreams for a better life. Contact : sudhafoundation777@yahoo.com