02 January, 2026 : Petlur గ్రామంలోని సుధా ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఈ రోజు కొమ్ము దయాకర్ 26వ పుట్టినరోజు సందర్భంగా హృదయాన్ని తాకే సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా ఫౌండేషన్ వృద్ధాశ్రమ ఆధ్వర్యంలో ఆయన స్వయంగా వృద్ధులకు మరియు పేద కుటుంబాలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.
సమాజ సేవే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, గ్రామంలోని వృద్ధులు మరియు ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు ఈ సహాయాన్ని పొందారు. ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు హర్షాతిరేకంగా స్వాగతించారు.
ఈ సందర్భంగా కొమ్ము దయాకర్ మాట్లాడుతూ, పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ద్వారా నిజమైన ఆనందం లభిస్తుందని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టారు సామ్యూల్ గారు, సుధా ఫౌండేషన్ అధ్యక్షుడు కొమ్ము సుధాకర్ గారు, ప్రేమరాజు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు హాజరై, యువత సమాజ సేవలో ముందుకు రావాలని ఈ కార్యక్రమం ప్రేరణగా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
Comments
Post a Comment